జరిగితే బండి, జరక్కపోతే బండ..

మనిషిగా గుర్తింపు పొందాలంటే నిత్యచైతన్యంతో విరాజిల్లాలి. అలాకాక బద్ధకంతో ఒకచోట పడి ఉంటే ఎవరూ లెక్కచేయరని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. బండి చైతన్యానికి, చలనానికి ప్రతీక. బండ మొద్దుతనానికి గుర్తు. జరిగి ముందుకు సాగిందంటే అది బండి లక్షణం. ఒకచోట పడి ఉందంటే అది బండ లక్షణం. కనుక ఎప్పుడూ బండబారిపోయి ఉండొద్దు, బండిలా ముందుకు సాగుతూ ఉండు అని చెప్పేటప్పుడు ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది

మూలం/సేకరణ: 
eenadu.net