ఆముదపు విత్తులు ఆణిముత్యాలవుతాయా అన్నట్టు..

కొంతమందిని మార్చి మంచి పద్ధతిలో పెట్టాలని ఎంత ప్రయత్నం చేసినా అది సాధ్యం కాదు. వారి సహజ గుణాన్ని మార్చుకోక పాత పద్ధతిలో అలాగే ఉండిపోతారు. ఆముదపు గింజల్ని ఎంతగా చెక్కి రంగులద్దినా వాటిని ఆణిముత్యాలు అని ఎవరికైనా చూపించి నమ్మించటం కూడా కష్టమే అవుతుంది. ఇదే పద్ధతిలో సహజసిద్ధమైన పద్ధతులు ఎప్పుడూ మారవని, దానికోసం చేసే ప్రయత్నం వృథా అని వివరించే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

మూలం/సేకరణ: 
eenadu.net