ఈ మొగానికి శేరు పసుపు...

ఒక్కొక్కసారి అనర్హులను అర్హులుగా భావించి వారికి సన్మానాలు, సత్కారాలు చేయటం జరుగుతుంటుంది. అలా అనర్హులకు లభ్యమయ్యే గౌరవాన్ని చూసినప్పుడు వారి విషయం తెలిసిన వారు విమర్శిస్తూ మాట్లాడే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగం వినిపిస్తుంటుంది. శేరు పసుపు ముఖానికి రాయాలంటే ఆ ముఖం ఎంతో పెద్దదై ఉండాలి. చాలా పెద్దది అనుకొని శేరు పసుపును తెప్పించి పెట్టిన తరువాత చిన్న ముఖంతో వచ్చిన వ్యక్తిని చూసి అనుకున్నట్లుగా ఈ జాతీయం కనిపిస్తుంటుంది. కానీ దీని వెనుక మాత్రం సామాజికంగా అనర్హులకు కట్టబెట్టే సంపదలను లేదా సౌకర్యాలను చూసి విమర్శించడం అనే విషయం దాగి ఉంది.

మూలం/సేకరణ: 
eenadu.net