పిలిచి పెద్దపులికి పేరంటం చేసినట్లు..

ప్రమాదాలను కొనితెచ్చుకొని, ప్రమాదకారులను గౌరవిస్తూ ప్రమాదంలో పడటం తెలిసో తెలియకో చాలాసార్లు జరుగుతుంటుంది. అలాంటి సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. పెద్దపులి ఎంతటి క్రూరజంతువో అందరికీ తెలిసిందే. అలాంటి పెద్దపులిని పనిగట్టుకొని పిలిచి పేరంటం చేస్తే ఆ క్రూరజంతువు ఎలా ప్రవర్తిస్తుందో ఎవరైనా వూహించవచ్చు. అలాంటి సందర్భాలలో 'ఆయనను ఇక్కడకి పిలవటమంటే పెద్దపులిని పిలిచి పేరంటం చేసినట్లే లెక్క. అందుకే ఆయనను పిలవద్దంటున్నాను' అనేలాంటి ప్రయోగాలున్నాయి.

మూలం/సేకరణ: 
eenadu.net