దరిలేని బావి దాపులేని కొంప అన్నట్టు

వెళ్లటానికి సమీపంలో లేని విషయాలను గురించి చెప్పుకొనేటప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు. మనిషికి కావలసిన ప్రధాన అవసరాలలో తాగటానికి నీరు, ఉండటానికి ఇల్లు ముఖ్యమైనవి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ జాతీయం అవతరించింది. బావి దగ్గరగా ఉంటే నీటి సౌకర్యం బాగా ఉంటుంది. చేసే ఉద్యోగానికో లేదా పనికో ఇల్లు దగ్గరగా ఉంటే ఎంతో అనువుగా ఉంటుంది. అలా కాకపోతే అన్నీ కష్టాలే. అలా ఏ పనిలోనైనా అసౌకర్యాలను అనుభవిస్తున్నప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.

మూలం/సేకరణ: 
eenadu.net