కాణీకి టెంకాయ ఇస్తారని కాశీదాకా వెళ్లినట్టు

కొంతమంది అత్యాశకు పోయి అధికంగా ఖర్చు చేస్తుంటారు. అలాంటి వారిని గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. పూర్వం కాణీలు, అణాలు ఉన్న రోజుల్లో ప్రచారంలోకి వచ్చిన జాతీయమే అయినా ఈ నాటికీ చాలామందికిది వర్తిస్తుంది. కాశీ నగరంలో అయితే టెంకాయ ఒక కాణీకే ఇస్తున్నారు. తమ వూళ్లో అయితే మూడుకాణీలు పెట్టాలి అని ఒకామె కాశీదాకా బయలు దేరిందట. ఇలా వెళ్లడానికి దారిబత్తెం ఎంతో ఖర్చువుతుంది. అదంతా ఆలోచించకుండా కాశీకి వెళ్లిందామె. తిరిగొచ్చి లెక్కలు చూసుకొంటే తానెంత నష్టపోయింది అర్థమైందట. అలాగే కొంతమంది అనాలోచితంగా ప్రవరిస్తూ ఖర్చు చేస్తున్నప్పుడు కాణీకి టెంకాయ ఇస్తారని కాశీ దాకా వెళ్లినట్టుంది అని అనటం కనిపిస్తుంది.

మూలం/సేకరణ: 
eenadu.net