చవి ఎరిగిన కుక్క చావగొట్టినా పోదన్నట్టు..

కొంతమంది ఎదుటివారి ఇళ్లలో భోజనాలు చేసే సమయానికి, అల్పాహారం చేసే సమయానికి వచ్చి తిని వెళుతుంటారు. ఇలా ఒకటిరెండు రోజులైతే ఎవరూ ఏమీ అనుకోరుకానీ ప్రతిరోజు సమయం చూసుకొని కచ్చితంగా తినే వేళకు వచ్చి కూర్చోనేవారిని చూసి విసుక్కునే సందర్భాలలో ఈ జాతీయాన్ని ప్రయోగించటం కనిపిస్తుంది. ఒక చోట ఆహారపు రుచి మరిగిన కుక్క ఎంతకొట్టినా పోదన్నది దీని అర్థం. రోజు వచ్చి వూరకనే తినిపోయేవారిని అలాంటి కుక్కతో పోల్చి చెప్పటం ఈ జాతీయంలో విశేషం.

మూలం/సేకరణ: 
eenadu.net