రాగల వసంతాన్ని కాకులు ఆపుతాయా అన్నట్టు..

ఒకరి అదృష్టాన్ని మరొకరు పాడుచేయలేరని అంటారు. అలాంటిదే ఇది. రుతువుల క్రమంలో వసంత రుతువు రావటం, కోయిలలు కూయటం ఇవన్నీ మామూలే. అయితే వసంతంలో కోయిలలు కూస్తాయని అప్పుడు వాటినే అందరూ మెచ్చుకొంటారని కుళ్లుకునే కాకులు వసంతం రాకూడదు, రాకూడదు అంటూ అనుకుంటూ కూర్చున్నాయట. కానీ వసంతం రానే వచ్చింది, కోయిల కూతలు వినిపించాయి. ఇదేతీరులో శుభాలు జరగాలని రాసి ఉంటే దాన్ని ఆపడం ఎవరివల్లా కాదని చెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

మూలం/సేకరణ: 
eenadu.net