కుక్క వేషం వేసి మొరగనంటే ఎలా?

ఒక పనిని ఒప్పుకున్నప్పుడు దానికి సంబంధించిన వాటన్నిటినీ చెయ్యాల్సిందే. సగం పనులు చేసి మిగతావి చెయ్యటం నాకు ఇష్టం లేదు. నేను చెయ్యను అనంటే అది కుదిరేపనికాదు అని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. ఇక్కడ కుక్క అని అనడం నీచత్వానికి ప్రతీక. అవినీతిలాంటి నీచకార్యాలకు పాల్పడినప్పుడు దానికి సంబంధించిన ఏ కష్టనష్టాలు వచ్చినా అన్నిటినీ అనుభవించాల్సిందే. అలాకాక నేను చేసేది ఇంతవరకే, మిగతాదంతా రహస్యంగా ఉండాల్సిందేనని అంటే ఎవరూ ఊరుకోరు. ఈ విషయాన్ని తెలియ చెప్పటమే ఈ జాతీయం లక్ష్యం.

మూలం/సేకరణ: 
eenadu.net