ఉంటే ఉగాది లేకపోతే శివరాత్రి అన్నట్టు..

పండుగలు జరుపుకొనే తీరును జీవన గమనానికి ముడిపెట్టి చెప్పిన జాతీయం ఇది. ఉగాది పండుగనాడు కొత్తబట్టలు, పిండివంటలతో అంతా సుఖసంతోషాలతో ఉంటారు. శివరాత్రి అంటే ఉపవాస ప్రధానమైన పండుగ. ఏవీ తినకూడదు. అంటే డబ్బులుంటే కొంతమంది ఉగాది పండుగ చేసుకున్నంత సంబరంగా కాలం గడుపుతారు. అదే డబ్బు లేకపోతే ఆకలితో మాడుతూ కాలక్షేపం చేస్తుంటారు. ఉన్నప్పుడు బాగా ఖర్చుపెట్టి లేనప్పుడు కష్టాలు పడేలాంటి వారిని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ీవాడంతే ముందు చూపు ఉండదు. ఉన్నప్పుడు ఉగాది, లేకపోతే శివరాత్రిలా ఉంటాడు' అనేలాంటి ప్రయోగాలున్నాయి.

మూలం/సేకరణ: 
eenadu.net