ఈ అన్నది లేదు, తే అన్నదే తరతరాలుగా వస్తున్నది..

ఈ (ఇవ్వు) అన్నది లేదని, తే (తీసుకురా) అన్నదే అలవాటని చెప్పటం ఈ జాతీయంలో అంతరార్థం. ఇక్కడ కనిపిస్తున్న ఈ, తే అనే రెండూ రెండు విభిన్నార్థాలను కలిగి ఉన్నాయి. ఈ అంటే దయచేసి ఇవ్వు అని బతిమలాడటం లేదా యాచించటం, తే అంటే తీసుకురా అని ఆజ్ఞాపించటం అనేది అర్థం. అంటే తనకు యాచించే స్థితి ఏనాడు లేదని, ఎప్పుడూ ఒకరిని ఆజ్ఞాపించి పని చేయించుకొనే ఉన్నత స్థితేనని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

మూలం/సేకరణ: 
eenadu.net