చచ్చిన పామును కొట్టడానికి అందరూ బంట్లేనన్నట్టు

హాని కలిగించని పని, కష్టం లేని పని అంటే ఆ పని చేయటానికి అందరూ ముందుకొస్తారని, శక్తిహీనులు కూడా తాము శక్తివంతులమని చెప్పుకోటానికి అలాంటి పనులకు ముందుకు వస్తారని తెలియచెప్పటమే ఈ జాతీయ లక్ష్యం. చచ్చిన పామును కొట్టడానికి అందరూ బంట్లేనన్నట్టు ఈ చిన్నపని చేయటానికి నేనంటే నేనంటూ అందరూ ముందుకొచ్చారు అనేలాంటి ప్రయోగాలున్నాయి.

మూలం/సేకరణ: 
eenadu.net