అమ్మా తల్లీ అంటే అప్పాలన్నీ తినేసిందన్నట్టు..

చనువిస్తే చంకనెక్కింది అన్న దానికి సమానార్థకం ఇది. కొంతమందికి ఏ కొంచెం అలుసిచ్చినా మొత్తం ఆక్రమించి అలుసిచ్చిన వారిని అణగదొక్కుతుంటారు. అలాంటి వారి గురించి ప్రస్తావించాల్సినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. ఒకామె కాస్తంత కష్టకాలంలో ఉంది కదాని ఆమె మనస్సును కష్టపెట్టడం ఇష్టం లేక అనునయిస్తూ బతిమలాడారట ఎదుటివారు. దాంతో ఆమె తనను వారంతా బతిమలాడుతున్నారంటే తానే గొప్ప అనుకొని ఎదుటివారు తినటానికి సిద్ధంగా ఉంచుకొన్న అప్పాలను (పిండి వంటలను) మొత్తం లాక్కొని తానే తినేసిందట. ఈ ఘటన ఆధారంగా ఈ జాతీయం ప్రచారంలోకి వచ్చింది.

మూలం/సేకరణ: 
eenadu.net