కాలుజారి నేల మీద పడి నేల అచ్చిరాలేదన్నట్టు అన్నది జాతీయం. ఆడలేక మద్దెల ఓడన్న దానికి ఇది సమానార్థకం. ఓ వ్యక్తి సరిగా చూసుకోకుండా అజాగ్రత్తగా నడుస్తూ జారి కిందపడ్డాడట. అజాగ్రత్తగా ఉండటమన్నది అతడి వైపు నుంచి జరిగిన తప్పు. ఆ తప్పును కప్పిపుచ్చుకొనేందుకు ఛీఛీ ఈ నేల నాకు కలిసి రాలేదని విసుకున్నాడట. ఇదే తీరులో కొంతమంది తమకు అప్పగించిన పనిని చేయలేక తమ అసమర్థతను కప్పి పుచ్చుకుంటూ ఎదుటివారి మీదనో, ఆ పని చెప్పిన వారి మీదనో నిందలు మోపుతుంటారు. అలాంటి సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది