గరుడాయ లెస్సా అంటే...

గరుడాయ లెస్సా అనంటే శేషాయ లెస్సా అన్నట్టు అన్నది జాతీయం. గరుడుడు, శేషుడు ఎవరి స్థాయిలలో వారు గొప్పవారే. కానీ ఒకరినొకరు పలకరించుకోవటానికి వారి మధ్యన ఉండే జాతి వైరాలులాంటివి అడ్డు వచ్చే అవకాశాలుంటాయి. ఆత్మాభిమానం కూడా అడ్డురావచ్చు. కానీ పరిస్థితిని ప్రశాంతంగా ఉంచడానికి ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు ముందుగా ఎదుటివారిని ఎలా పలకరిస్తే కచ్చితంగా అదే తరహా పలకరింపులో ఎదుటివారు కూడా పలకరించవచ్చు. ఇలాంటి పరిస్థితులు ఎక్కడైనా ఎదురైనప్పుడు ీఆ ఇద్దరూ ఎదురైనప్పుడు గరుడాయ లెస్సా అంటే శేషాయ లెస్సా అన్న తీరులో సంభాషణ సాగింది తప్ప అంతకంటే ఏమీ జరగలేదు' అనే లాంటి ప్రయోగాలున్నాయి.

మూలం/సేకరణ: 
eenadu.net