పనిచేసేవారికి, శక్తిసంపన్నులకు ఏ ప్రదేశమైనా ఒకటేనని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ఉద్యోగుల బదిలీ విషయంలో ఇది ఎక్కువగా వినిపిస్తుంటుంది. పులి గాంభీర్యానికి, శక్తికి సంకేతం. శక్తిగలవాడు లేదా తెలివికలవాడు ఎక్కడకు బదిలీ అయినా తన పని తాను సక్రమంగానే నిర్వర్తిస్తాడని తెలియచెప్పే సందర్భాలలో దీన్ని వాడుతుంటారు.