ఇచ్చిన వాడు తలమీద.. ఇవ్వనివాడు నేలమీద..

తమకు సహాయం చేసిన వారిని మాత్రమే కొందరు గౌరవిస్తుంటారు. ఇతరులను ఏమాత్రం పట్టించుకోకపోగా కొన్ని సందర్భాలలో అవమానిస్తుంటారు కూడా. అలాంటి వారిని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంటుంది.'వాడితో జాగ్రత్త ఇచ్చినవాడు తలమీద, ఇవ్వనివాడు నేలమీద అనే రకం' అనేలాంటి ప్రయోగాలున్నాయి.

మూలం/సేకరణ: 
eenadu.net