కొంతమంది లోకుల సొమ్ముతో సరదాగా కాలక్షేపం చేస్తుంటారు. అలాంటి వారిని గురించి వ్యంగ్యంగా చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు. దేవుడిముందు వెలిగించే దీపంలో వత్తికి సంబంధించిన పత్తి, చమురు అన్నీ వూరి వారివే. కానీ ఆ దీపపుకాంతి ఆలయంలో ప్రసరిస్తూ కాంతిని కలిగిస్తుంటుంది. అలాగే కొంతమంది ఎదుటివారిచ్చే డబ్బు లేదా ఇతర వస్తువులను వాడుకొంటుంటారు. అవన్నీ వారివేనన్న భ్రమను కలిగిస్తుంటారు. అలాంటి సందర్భాలలో దీని ప్రయోగం గమనార్హం. ఇక్కడ వూగూగు దేవుడా అన్నది బాగా ఆనందించు నీదేమీ పోయిందిలే అనే అర్థాన్ని కలిగిస్తుంది.