చిత్తశుద్ధి కలిగిచేసిన పుణ్యంబు

పధ్యం:: 

చిత్తశుద్ధి కలిగిచేసిన పుణ్యంబు
కొంచెమైన నదియు కొదవగాదు
విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంతో
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము: 
తాము ప్రబోధించే సంస్కారం చాలా పుణ్యమైంది. దీనిని చిత్తశుద్ధితో చేస్తే సిద్ధించే ఫలితం ఎంత చన్నిదైనా అదేం తక్కువ పనికాదు. చూడ్డానికి మర్రి విత్తనమంత కనిపించినా సారవంతమైన నేలలో నాటితే మర్రి వృక్షంగా రూపొందుతుంది.