కొంచెపు నరుసంగతిచే

పధ్యం:: 

కొంచెపు నరుసంగతిచే
నంచితముగఁ గీడువచ్చు నదియెట్లన్నన్
గించిత్తు నల్లి కుట్టిన
మంచమునకుఁ జేటువచ్చు మహిలో సుమతీ!

తాత్పర్యము: 
చిన్న నల్లి కుడితే... ఆ నల్లి ఉన్న మంచాన్ని ఎండలో వేయడం, కర్రతో కొట్టడం, మరుగునీళ్లు పోయడం మొదలైన వన్నీ చేస్తాం. నల్లితో స్నేహం చేయడం వల్లే మంచానికే ఈ కష్టాలు. అలాగే అల్పుడైన వాడితో స్నేహం చేస్తే ఎలాంటి వారికైనా ఆపదలు వస్తాయి.