అనవసరమైన పనిని మీద వేసుకొని కష్టాలను అనుభవించటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఓ వ్యక్తి కాలిబాటన నడుస్తూ ఉంటే పక్కన నేలమీద ఒక బండరాయి కనిపించిందట. అతడు తన దోవన తాను పోక ఆ రాయిని పెకలించి ఎత్తి నెత్తిన పెట్టుకున్నాడట. ఆ తర్వాత ఆ బరువు మొయ్యలేక కష్టాన్ని అనుభవించాడు అని చెప్పే సంఘటన ఈ జాతీయ ఆవిర్భవానికి వేదిక. ఇలాగే కొంతమంది అనవసరమైన పనులను మీద వేసుకొని ఇబ్బందులు పడుతుంటారు. అలాంటప్పుడు ీనేలరాయి నెత్తికెత్తుకున్నట్లు నీకెందుకు ఈ లేనిపోని బాధ' అనేలాంటి ఉదాహరణలున్నాయి.అనవసరమైన పనిని మీద వేసుకొని కష్టాలను అనుభవించటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఓ వ్యక్తి కాలిబాటన నడుస్తూ ఉంటే పక్కన నేలమీద ఒక బండరాయి కనిపించిందట. అతడు తన దోవన తాను పోక ఆ రాయిని పెకలించి ఎత్తి నెత్తిన పెట్టుకున్నాడట. ఆ తర్వాత ఆ బరువు మొయ్యలేక కష్టాన్ని అనుభవించాడు అని చెప్పే సంఘటన ఈ జాతీయ ఆవిర్భవానికి వేదిక. ఇలాగే కొంతమంది అనవసరమైన పనులను మీద వేసుకొని ఇబ్బందులు పడుతుంటారు. అలాంటప్పుడు ీనేలరాయి నెత్తికెత్తుకున్నట్లు నీకెందుకు ఈ లేనిపోని బాధ' అనేలాంటి ఉదాహరణలున్నాయి.
సేకరణ: ఈనాడు.నెట్