పూసిన పూలన్నీ కాయలవుతాయా

పూసిన పూలన్నీ కాయలవుతాయా అన్నది జాతీయం. ప్రయత్నం విఫలమైన సందర్భంలో విసిగిపోవద్దని, మళ్లీ మళ్లీ ప్రయత్నం చేయమని ధైర్యం చెప్పే సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. చెట్టుకు పువ్వులు పూస్తాయి. అయితే పూసిన పూలన్నీ కాయలవ్వవు, పండ్లుగా మారవు. కొన్ని మధ్యలోనే రాలిపోతాయి. కొన్ని పిందె వేసే స్థితికి వచ్చి రాలిపోతాయి. కాయలుగా మారేవి కొన్నే. పండ్లుగా మారేవి అందులో కొన్నే. ప్రకృతిలో కనిపించే ఈ సత్యాన్ని గమనించి అనుకొన్న పని జరగనప్పుడు ఎంతగా కష్టపడినా అప్పటికి ఫలితం దక్కనప్పుడు ఈ జాతీయాన్ని చెప్పి ఓదార్చటం కనిపిస్తుంది. పూసిన పూలన్నీ కాయలవుతున్నాయా చెప్పు.. అలాగే అనుకోగానే జరగాలని ఏమీ లేదు. మరోసారి ప్రయత్నం చేయి' అనేలాంటి ప్రయోగాలున్నాయి.

 

సేకరణ: ఈనాడు.నెట్