ఆరేసి మూడెత్తుకున్నట్టు

మూడు పువ్వులు, ఆరుకాయలు అనే దానికి వ్యతిరేకార్థం ఇచ్చే జాతీయం ఇది. ఆరు వెయ్యడమంటే ఆరు ఖర్చుపెట్టడం అని అర్థం. ఆరు ఖర్చుపెడితే దక్కింది మూడేనట. అంటే పెట్టుబడిలో సగానికి సగమే దక్కిందన్నమాట. ఇలా నష్టపోయిన సందర్భాలలో ఉపయోగించిన జాతీయం ఇది. వ్యాపారమేమీ బాగోలేదు. ఆరేసి మూడు తీసుకున్నట్లుంది అనేలాంటి సందర్భాలలో ఈ జాతీయం కనిపిస్తుంది.

 

సేకరణ: ఈనాడు.నెట్