అసమర్థులు చెప్పే ప్రగల్భాలను గురించి వివరించే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. కూర్చొన్న చోటు నుంచి లేవటానికే శక్తిలేనప్పుడు నడుము నొప్పిపుట్టేలా వంగి ఎంతోదూరం నడుచుకొంటూ వెళతాననటం ఎంత నమ్మశక్యమో అదే తీరులో ఏమాత్రం శక్తిలేకపోయినా ఎన్నెన్నో చేసి తీరుతామంటారు కొందరు.ఈ చిన్నపని చేసిపెట్టలేనివాడు రేపంతా నాదగ్గరే ఉండి పనంతా చేస్తానంటున్నాడు. కూర్చొని లేవలేనమ్మ వంగొని శివరాత్రికి వస్తాన్నన్నట్టుంది వాడు చెప్పే మాట' అనేలాంటి ప్రయోగాలున్నాయి.
సేకరణ: ఈనాడు.నెట్