కూటికి లేకున్నా కాటుక చుక్క మానన్నట్లు

కాటుక పెట్టుకోవటం అలంకార సూచకం. కూటికి లేకపోవటమంటే పేదరికంలో మగ్గిపోవటమని, ధనహీనస్థితి అని అర్థం. కొంతమంది ఇలాంటి కష్ట పరిస్థితుల్లో ఉన్నా తిండైనా మానుకుంటారు. కానీ అలంకారాలు చేసుకోవటం మానుకోరు. అలాంటి వారిని చూసి మాట్లాడుకునే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. 'కూటికి లేకున్నా కాటుక చుక్క మానన్నట్లు ఇప్పుడు సరిపోయినన్ని డబ్బులు లేనప్పుడు ఇవి కొనటం అనవసరం' అనే లాంటి ప్రయోగాలున్నాయి.

 

సేకరణ: ఈనాడు.నెట్