ఇంగలంబు తోడ నిల సల్పుతోడను

పధ్యం:: 

ఇంగలంబు తోడ నిల సల్పుతోడను 
పరుని యాలితోడ పతితుతోడ 
సరసమాడుటెల్ల చావుకు మూలము 
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యము: 
నిప్పుతోను, నీచుడితోనూ, పాపాత్ముడితోను, పరస్త్రీ తోనూ పరిహాసమాడడం తన ప్రాణానికి హాని కలిగిస్తుంది.