ఆలి ఏడ్చిన ఇల్లు, ఎద్దు ఏడ్చిన సేద్యం

భార్యను కష్టపెట్టకూడదని అలా చేస్తే ఆ ఇంట్లో ఏదీ కలిసిరాదనే విషయాన్ని వివరించి చెప్పే జాతీయం ఇది. మన దేశం ప్రధానంగా వ్యవసాయ దేశం. కనుక వ్యవసాయపరమైన ఎద్దు ఏడ్పును ఆలి ఏడుపుతో పోల్చి చెప్పటం జరిగింది. వ్యవసాయదారుడు ఎద్దును సరిగా పోషించకుండా వ్యవసాయం చేయాలనుకొంటే ఎలా నష్టం కలుగుతుందో అలాగే భయంకరమైన నష్టం ఆలిని ఏడిపించిన భర్తకు కూడా కలుగుతుందని ఉదాహరణపూర్వకంగా ఈ జాతీయం వివరిస్తోంది.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్