వూపిరి ఉంటే ఉప్పమ్ముకొని బతకవచ్చు

ప్రాణం విలువను తెలియచెప్పే జాతీయం ఇది. కొంతమంది క్షణికావేశంలో అనాలోచితంగా ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. అలాంటి వారికి హెచ్చరికగా ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. ఒకసారి ప్రాణం పోతే తిరిగిరాదు. ఆ తర్వాత భూమ్మీద ఏం చేయటానికి అవకాశమే ఉండదు. బతకడానికి బోలెండత సంపద అవసరమే లేదు. కొద్దిపాటి సంపాదనతో కూడా ఆత్మాభిమానంతో గౌరవంగా బతకవచ్చు అని తెలియచెప్పేందుకు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. 'చచ్చి సాధించేది ఏమీ లేదు. వూపిరి ఉంటే ఉప్పమ్ముకొనైనా బతకొచ్చు సుమా' అనేలాంటి ప్రయోగాలున్నాయి.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్