ఆ గొడ్డు మంచిదైతే ఆ వూళ్లోనే అమ్ముడుపోతుందన్నట్టు

ఒకరి ప్రతిభను గురించి అంచనావేసి చెప్పే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంది. కొంతమంది తమకు సరైన అవకాశాలు తామున్నచోట రావటం లేదని, అక్కడున్న వాళ్లంతా అసూయాపరులు, దుర్మార్గులు అని అందుకే వేరొక చోటికి వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నట్టు చెబుతారు. అయితే ప్రతిభ అనేది ఒకరు ఆపితే ఆగేది కాదని చెప్పే పెద్దలు ఈ జాతీయాన్ని ఉదహరిస్తూ వేరొక చోట ప్రయత్నాలు చేసేవారిని గురించి విమర్శిస్తూ మాట్లాడేటప్పుడు ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. 'ఆ గొడ్డే మంచిదైతే ఆ వూళ్లోనే అమ్ముడుపోతుందన్నట్టు వీడు నిజంగా పనిమంతుడే అయితే వెళ్లగొట్టేవారే కాదు' అనేలాంటి ప్రయోగాలున్నాయి.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్