ముమ్మూట అరవై రోగాలకు...

ముమ్మూట అరవై రోగాలకు మూడు గుప్పెళ్ల కరక్కాయ పొడి అన్నట్టు అన్నది జాతీయం. జాతీయాలు జీవితానుభవసారాన్ని నింపుకొని తరతరాలకు చైతన్యదీపికలుగా అందుతూ ఉంటాయి. ఇలాంటి వాటిలో ఔషధ విలువలను, ఆరోగ్యపరిరక్షణ అంశాలును గురించి తెలియచెప్పేవి కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిలో ఇదొకటి. ముమ్మూట అరవై అనంటే మూడు నూర్లు, అరవై అని. అంటే మూడు వందల అరవై. మూడు వందల అరవై అనేది ఇక్కడ ఎన్నెన్నో అనే అర్థంలో ఉపయోగించిన సంఖ్యావాచకం. అంటే అన్నెన్ని రోగాలకు కరక్కాయపొడి మంచి ఔషధంగా పనిచేస్తుందని. కనుక కరక్కాయ విలువను తెలుసుకోమని చెప్పే సందర్భాలలో దీని ప్రయోగం కనిపిస్తుంది.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్