ఇంటి ఇంటిలోననీశ్వరుడుండగ
నంటి చూడలేక యడవులందు
నుంట మేటంచునుందురా జోగులై
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యము:
ఎల్లప్పుడూ ఈశ్వరారాధన చేస్తూ ఉండాలి. అయితే ఈశ్వరుడెవరు, ఎక్కడ ఉంటాడనీ వెతికేందుకు అడవులకు వెళ్లాల్సిన అవసరంలేదు. తనలోనే తత్వం ఉంచితే, ఇంట్లోనే ఈశ్వరుడుంటాడు. అందరిలోనూ ఆ దేవుడు ఉంటాడు.