నోట్లో చక్కెర, కడుపులో కత్తెర అన్నట్లు

పైపై మాటలు ప్రేమపూర్వకంగా ఉంటూ అంతరంగంలో శత్రుత్వాన్ని, పగను కలిగి ఉన్నవారిని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. మాటకు ప్రతీక నోరు. చేతలకు, రక్షణలాంటి కార్యాలకు ప్రతీక కడుపు. కడుపులో దాచుకోవటం అంటే జాగ్రత్తగా రక్షించటం అనే అర్థం ఉంది. అయితే ఇక్కడ కడుపులో కత్తెర అని అన్నందువల్ల ప్రాణాంతకమైన కార్యమని, రక్షణకు విరుద్ధమని అనే అర్థాలు స్ఫురిస్తాయి. కడుపులో విషం పెట్టుకోవటం అని అన్నప్పుడు కూడా ఇలాంటి భావనే కలుగుతుంది. 'వాణ్ణి నమ్మొద్దు, నోట్లో చక్కెర, కడుపులో కత్తెర ఉండే మనిషి జాగ్రత్త' అనే లాంటి ప్రయోగాలున్నాయి.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్