ఇంట్లోవాడే పెట్టెరా కంట్లోపుల్ల అన్నట్లు

సొంతమనుషులు అని అనుకొన్నవారు మోసం చేసినప్పుడు, నమ్మక్రదోహం జరిగిన సందర్భాలలోనూ ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. ఇంట్లో వారు అనంటే సొంతవారు, నా అని అనుకొన్నవారు అని అర్థం. కంట్లో పుల్లపెట్టడమంటే భయంకరమైన ద్రోహం చేయటమని అర్థం. ఇలా ఈ అర్థాలసారంగా ఈ జాతీయం అవతరించింది. 'మనవాడేకదాని దగ్గర చేసినందుకు ఇంట్లోవాడే పెట్టెరా కంట్లో పుల్ల అన్న చందంగా జరిగింది' అనేలాంటి ప్రయోగాలున్నాయి.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్