దేహ సంబంధమైన రోగాల గురించి కూడా మన జాతీయాలు విశ్లేషిస్తుంటాయి. వైద్యశాస్త్రపరంగా పలు జాతీయాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అలాంటి వాటిలో ఇదొకటి. రోగ సంబంధమైన విషయాలను అనుభవపూర్వకంగా తర్వాత తరాల వారికి తెలియజేసే వాటిలోనిది ఇది. పడిశం సర్వసాధారణమైన రోగంగా అనుకోవడానికి వీలులేదు. ఎందుకంటే పడిశం పడితే పది రోగాలు ఒకేసారి ఎంత ఇబ్బంది పెడతాయో అంత ఇబ్బంది మనిషికి కలుగుతుంది. ఈ విషయాన్ని అత్యంత సులువుగా, నేరుగా తెలియచెప్తున్నట్లు ఉంటుంది ఈ జాతీయం.