కొడుకును కంటాను అత్తమ్మా అంటే..

కొడుకును కంటాను అత్తమా అంటే వద్దంటానా కోడలమ్మా అన్నట్టు అన్నది జాతీయం. ఇష్టమైన వస్తువులను లేదా పదార్థాలను ఒకరి దగ్గర నుంచి తీసుకొనేటప్పుడు వాడుకలో ఉన్న జాతీయం ఇది. ఇష్టమైన వస్తువులను ఇస్తామంటే కాదనేవారు ఎవరు? అనే భావంలో ఇది వాడుకలో కనిపిస్తుంది. వంశోద్ధారకుడైన కొడుకును కంటానని అత్తతో కోడలు అంటే ఆ అత్త ఆనందపడుతుంది. దీని ఆధారంగానే ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్