ఉప్పు తిన్న ప్రాణం వూరుకోదన్నట్టు

కొంతమంది ఎదుటివారి దగ్గర మేలు పొందినప్పుడు తిరిగి ఏదో ఒక మేలు చేసి తమ కృతజ్ఞతను తెలుపుకోవాలని అనుకుంటారు. అలాంటివారి తత్వాన్ని గురించి వివరించే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. ఉప్పు ఆహార పదార్థాలలో రుచి కోసం వేస్తుంటారు. అయితే ఉప్పు తినటం అనే మాటకు కష్టాల్లో ఉన్నప్పుడు ఆహారపరంగా కానీ వ్యవహారపరంగా కానీ సహాయం పొందటం అనే అర్థంలో వాడుకలో ఉంది. 'ఉప్పు తిన్న ప్రాణం వూరుకోదన్నట్టు వాడు చేసిన సహాయానికి బదులుగా ఆ కాస్త పని చేసొచ్చాను' అనే లాంటి ప్రయోగాలున్నాయి.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్