శ్రుతిలేని పాట సమ్మతిలేని మాట అన్నట్టు

ఇంపుగాలేని వ్యవహారం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. కొన్నికొన్ని పనులు ఇష్టం లేకపోయినా చేయాల్సిన పరిస్థితులొస్తాయి. అలాంటప్పుడు ఆ పరిస్థితులను ఈ జాతీయంతో పోల్చి చెప్పటం కనిపిస్తుంది. 'ఏమిటోలే ఇదంతా శ్రుతిలేని పాట సమ్మతిలేని మాట అన్నట్టుంది' అనేలాంటి ప్రయోగాలున్నాయి. పాటకు శ్రుతి లేకపోతే వినబుద్ధి కాదు. సమ్మతించటానికి ఇష్టపడకుండా ఏదో మాట్లాడాలి కదా అని అడిగిన దానికి ముక్తసరిగా మాట్లాడేమాట కూడా ఇంపుగా ఉండదు. ఈ భావన ఆధారంగానే ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్