అప్పు లేకపోతే ఉప్పుగంజైనా మేలు

అప్పు తీసుకోవడం దాన్ని తీర్చలేక కష్టాలపాలు కావటం మంచిది కాదని హెచ్చరించే సందర్భాలలో పెద్దలు ఉదహరించే జాతీయమిది. అప్పు చేసి పప్పుకూడు తిని ఆ తర్వాత అందరితోనూ అవమానాలు పొందేకన్నా తాను సొంతంగా సంపాదించుకున్న ఉప్పు వేసిన గంజైనా ఎంతో గొప్పదంటారు. పూర్వం ఇప్పట్లోలాగా ఇన్నిన్ని రకాలుగా అప్పులిచ్చే పద్దతులుండేవి కావు. తీర్చటానికి తగినన్ని వనరులు కూడా ఉండేవి కావు. ఆ రోజుల్లో ఉద్భవించింది ఈ జాతీయం. 'వాడిస్తానంటే మాత్రం అప్పు తీసుకుంటానా? అప్పు లేకపోతే ఉప్పు గంజైనా మేలు అన్నట్టుగా నాకున్న దాంట్లోనే నేను గడుపుకుంటాను' అనేలాంటి ప్రయోగాలున్నాయి.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్