గడ్డేసిన తావునే గొడ్డును కట్టెయ్యాలన్నట్టు

వనరులు ఉన్నచోటే నివాసం ఉండటం మేలన్న విషయాన్ని తెలియచెప్పే జాతీయమిది. గడ్డి ఒకచోట వేసి గొడ్డును ఇంకొక చోట కట్టేస్తే మేత తినక గొడ్డు ఆకలితో మాడుతుంది. గడ్డి గొడ్డుకు ఆహారపు వనరు. ఇదే తీరులో అన్నీ అందుబాటులో ఉండేచోట ఉండటం మేలు కానీ మరో చోటైతే ఇబ్బంది కలిగితీరుతుంది అని చెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుది. 'గడ్డేసిన తావునే గొడ్డును కట్టేయాలన్నట్టు మీవాళ్ళందరూ నీకు సహాయంగా నిలిచే చోటే నీవు కూడా నివాసం ఉండటం మేలు' అనే లాంటి ప్రయోగాలున్నాయి.