ఎలుగు తోలు తెచ్చి ఏడాది యుతికినా నలుపు నలుపేకాని తెలుపుకాదు కొయ్యబొమ్మ తెచ్చి కొట్టితే గుణియోనె విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యము:
ఎలుగుబంటి తోలును ఎన్నాళ్ళు ఉతికినా రంగు అలాగే ఉంటుంది తప్ప తెలుపుగా ఎట్టి పరిస్థితుల్లోను మారదు. కొయ్యబొమ్మను తీసుకువచ్చి ఎంతకొట్టినా దానికి సుగుణాలు అలవాటుకావు. అదేవిధంగా మూర్ఖుడికి ఎంత బోధించినా జ్ఞానం తలకెక్కదు.