సమాజంలో నిరంతరం ద్రోహచింతనతో ఉండేవారిని గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ఉపకారం చేయమని అడగటానికి వెళ్ళిన వ్యక్తికి ఉపకారం చేయకపోగా చేస్తున్నట్లు నటించి అపకారం చేసి అవమానిస్తుంటారు కొందరు. అదెలాంటిదంటే అన్నం పెట్టిమని అడిగిన వ్యక్తికి సున్నం పెట్టడం లాంటిదే. ఈ భావనతోనే ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. '' వాడి దగ్గరకు అనవసరంగా వెళ్ళి చెయ్యి చాపాను. అన్నం పెట్టమని అడిగితే సున్నం పెట్టిన తీరులో ఉంది వాడి ప్రవర్తన'' అనేలాంటి ప్రయోగాలున్నాయి.