ఆపద మొక్కులు, సంపద మరపులు అన్నట్టు

మనుషుల మనస్తత్వాలను, ప్రవర్తనల తీరును విశ్లేషిస్తుంటాయి జాతీయాలు. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. ఆపదలొచ్చినప్పుడు ఆదుకోమని వేడుకొంటుంటారు చాలా మంది. దయతలచి ఎవరైనా ఆదుకుంటే ఆ కష్టాల నుంచి బయటపడి ఆనందాన్ని అనుభవిస్తూ మేలు చేసిన వారిని మరచిపోయేవారు చాలామంది ఉంటారు. ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. 'అప్పుల్లో కూరుకుపోయి ఉన్నప్పుడు బతిమలాడితే సహాయం చేశాను. ఆపద మొక్కులు సంపద మరపులు అన్నట్టు నాలుగు డబ్బులు కనిపించేసరికి నన్ను మరచిపోయాడు' అనే లాంటి సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.