ఆరు రాజ్యాలు జయించవచ్చును కానీ...

ఆరు రాజ్యాలు జయించవచ్చును కానీ అల్లుణ్ణి జయించలేమన్నది జాతీయం. వివాహ వ్యవస్థలో బాగా బెట్టుచేస్తూ గర్వాహంకారాలను ప్రదర్శిస్తూ ఉండే అల్లుళ్లతో విసిగి వేసారిన వారు మాట్లాడుకునే సందర్భాలలో ఈ జాతీయం వినిపిస్తుంది. అల్లుడు అనగానే అంతకు ముందుదాకా లేని గర్వాన్ని తెచ్చిపెట్టుకొనే సంకుచిత మనస్తత్వం ఉన్నవారు సమాజంలో చాలాచోట్ల కనిపిస్తుంటారు. వారిని సంతృప్తిపరచటం తమవల్ల కావటం లేదని అనుకొనే సందర్భాలలో ఇది ప్రయోగంలో కనిపిస్తుంది.

 

సేకరణ: ఈనాడు.నెట్