సమాజంలో మనిషి ఎప్పుడు ఎలా ప్రవర్తించాలనే విషయాన్ని తెలియచెప్పేందుకు ఈ జాతీయం ఉపకరిస్తుంది. ధనం ఉంది కదాని ముందూ వెనుకా చూసుకోకుండా ఖర్చుపెట్టకూడదు... దాచుకోవాలి. అలాగే రోగం వస్తే వైద్యుడికి చూపించుకోకుండా చెప్పకుండా ఉండకూడదు. చెప్పి తగిన మందు తీసుకుని రోగాన్ని తగ్గించుకోవాలి అనే విషయ సూచనకు ఈ జాతీయం ఉపకరిస్తుంది.