మేలు జరుగుతుందని ఆశపడినప్పుడు అనుకున్న మేలు జరగకపోగా మరికొంత కీడు వచ్చిపడ్డ సందర్భాలలో ఈ జాతీయప్రయోగం కనిపిస్తుంది. ఓ వ్యక్తి దరిద్రంతో బాధపడుతూ తనకు కావలసిన అన్నం, వస్త్రాలు ఎవరో దానం చేస్తానంటే వెళ్ళాడట. కానీ అక్కడి పరిస్థితి మారిపోయి ఆ ప్రదేశంలో ఎదురైన కొంతమంది ఉన్న వస్త్రాన్ని కూడా లాక్కున్నారట. ఈ భావన ఆధారంగానే లాభం వస్తుందనుకున్నప్పుడు ఆశించిన లాభం రాకపోగా అనుకోని నష్టం ప్రాప్తించినప్పుడు కూడా ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.