తేనె పోసి పెంచినా వేపకు చేదుపోనట్టు

ఎంతగా నీతులు బోధించినా మనసు మారని దుర్మార్గులను గురించి తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు. వేపకు చేదు సహజ లక్షణం. నీళ్లకు బదులు తేనె పోసి ఆ చెట్టును పెంచినా చేదు పోయే అవకాశం లేదు. అలాగే దుష్ప్రవర్తన అనే సహజ లక్షణం ఉన్న వారిని ఎంతగా మంచిగా పెంచాలని చూసినా మారరని పెద్దలు విసిగిపోయి మాట్లాడే సందర్భాలలో ఈ జాతీయం వినిపిస్తుంటుంది.

 

సేకరణ: ఈనాడు.నెట్