గురువుకు తిరుమంత్రం చెప్పినట్లు

కొంతమంది అన్ని విషయాలలోనూ తామే గొప్ప అని భావించుకొంటుంటారు. అలాంటివారు తమకంటే గొప్పవారి దగ్గర అల్పమైన తమ గొప్పతనాలను ప్రకటించుకొంటున్నప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంటుంది. మంత్రజపం, సాధన చేయటంలో గురువు ఎప్పుడూ ముందడుగులోనే ఉంటాడు. కానీ ఓ శిష్యుడు తాను గురువును మించిన వాడినని భావించుకొంటూ ఆ గురువుకే మంత్రోపదేశం చేయబోయాడట. ఇటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఎదురైనప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.