గుడిసెకు చాందినీ అన్నట్టు

అసంబద్ధమైన వ్యవహారం, అనవసరమైన అలంకారం అనే అర్థాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. చాందినీలను గొప్పగొప్ప అలంకారాలకు గుర్తుగా చెబుతారు. అలాంటి ఎంతో సుందరమైన చాందినీ చక్కటి భవనం ముందుంటే ఆ భవనపు అందం ఇనుమడిస్తుంది. ఆ చాందినీ వేసినందుకు సార్థకత చేకూరుతుంది. అలాకాక ఏదో చిన్న గుడిసె ముందు అంత భారీ అందమైన చాందినీని వేస్తే నిరర్థకంగా అనిపిస్తుంది. ఈ భావన ఆధారంగానే ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది.

 

సేకరణ: ఈనాడు.నెట్