అప్పు తీసుకుంటే చెప్పు చేతలలో ఉండాలి

పూర్వకాలం నాటి పెద్దలు అనవసరంగా అప్పులు చేయవద్దని పిల్లలను హెచ్చరించే సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు. అప్పు నిప్పు అని కూడా అంటుంటారు. అప్పుంటే ముప్పు అని చెబుతుంటారు. ఇదంతా ఆర్థికపరంగా జాగ్రత్తపడమని, అనవసరమైన ఖర్చులు చేసి అప్పులపాలు కావద్దని తెలియచెప్పేందుకే ఒకరి దగ్గర అప్పు తీసుకుంటే ఆత్మాభిమానాన్ని వదులుకొని చెప్పిందే చేయాల్సి వస్తుందన్నది ఈ జాతీయం వెనుక ఉన్న భావం. అప్పు తీసుకొని అభివృద్ధి పనులకు ఉపయోగిస్తూ సక్రమంగా అప్పు తీర్చేవారికి ఇది అన్వయించకపోయినా ముందు జాగ్రత్త కోసం పిల్లల ముందు అనటం గమనార్హం.

 

సేకరణ: ఈనాడు.నెట్