కాలరాయటం

అణిచివేయటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. కాలితో తన్నటం అన్నా, కాలును ఉపయోగించి ఏదైనా వస్తువును దూరంగా విసిరేయటం అన్నా అవమానం, అసహ్యం లాంటి వాటికి ప్రతీకలుగా కనిపిస్తాయి. అంటే తనకు గిట్టని వాటిని అవమానించేందుకు మనిషి కాలును ఉపయోగిస్తుంటాడు. ఈ భావానికి అనుగుణంగా ఈ జాతీయం ఆవిర్భవించింది. కొన్నికొన్ని చోట్ల నీతినియమాలను, హక్కులను, అధికారాలను అణిచివేశారు అని చెప్పే సందర్భాలలో కూడా ఈ జాతీయం కనిపిస్తుంది. 'ఆ వర్గం వారి హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం కూలకతప్పదు'. అనేలాంటి సందర్భంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

 

సేకరణ: ఈనాడు.నెట్